News April 25, 2024
ఫస్టియర్ ఫలితాల్లో ఖమ్మం నాలుగో స్థానం

ఇంటర్ ఫస్టీయర్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 63.84 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. 16,015 మందికి 10,224 మంది పాసయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56.39 శాతంతో 15వ స్థానంలో నిలిచింది. 7,771 మందికి 4,382 మంది పాసయ్యారు.
Similar News
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News April 23, 2025
భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.
News April 23, 2025
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్, ఏలువారిగూడెంలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం నగరం, కల్లూరు మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.