News January 6, 2026
మళ్లీ ‘గుడ్ మార్నింగ్’ ప్రారంభిస్తా: కేతిరెడ్డి

త్వరలోనే మళ్లీ ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం ప్రారంభిస్తానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇచ్చినా ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన వారు గాలి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో నేతలు మౌనంగా ఉన్నారని, ఉపాధి హామీ పనులు ఆగితే ప్రజలు వలస వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News February 8, 2026
వనపర్తి: ప్రశాంతంగా 7వ రోజు ఇంటర్ ప్రాక్టికల్స్

వనపర్తి జిల్లాలోని 15 కేంద్రాలలో 7వ రోజు ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా ముగిశాయని DIEO అంజయ్య తెలిపారు. ఉదయం 486 మంది, మధ్యాహ్నం 581 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద ఆదివారం జరిగిన పరీక్షలకు 36 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు పలు పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు.
News February 8, 2026
జమ్మలమడుగు: కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

జమ్మలమడుగు మండలంలోని పెద్దండ్లూరు వద్ద పెన్నా నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5 వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పూజారులు చెబుతున్నారు. కన్యతీర్థం, తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ఒకే ఆచారం, పోలికలు ఉండటం మరో విశేషం.
News February 8, 2026
NRPT: ప్రచార కార్యక్రమాలపై నిషేధం: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సోమవారం సాయంత్రం 5 గంటల లోపు ముగించాలని రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రెండు రోజుల పాటు అనగా ఈనెల 11న పోలింగ్ ముగిసే వరకు వైన్స్, కల్లు దుకాణాలు మూసి వేయాలని చెప్పారు.


