News January 6, 2026
కరప: తల్లి మందలించిందని మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నివసించే సంగాని సూరిబాబు ఫ్యామిలీతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా తనను మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి(16) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.
Similar News
News February 15, 2026
NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.
News February 15, 2026
స్పీకర్ తర్వాత ‘ఎన్నికల కమిషనర్’.. అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు

CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండీ కూటమి సిద్ధమైనట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విపక్షాలు ఇప్పుడు ఏకకాలంలో ఇద్దరు రాజ్యాంగబద్ధమైన అధికారులను టార్గెట్ చేయడం పార్లమెంటరీ చరిత్రలో అరుదైన పరిణామం. మార్చి రెండో వారంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ నోటీసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BJPకి అనుకూలంగా CEC వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ.
News February 15, 2026
వరంగల్: కాంగ్రెస్ Vs BRS.. తేడా 2.89%

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా 2.89 శాతం మాత్రమే. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 3.35 లక్షల ఓట్లు ఉండగా, 2,62,377 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 1,10,680 ఓట్లు రాగా 42.19 శాతం , బీఆర్ఎస్ 1,03,117 ఓట్లతో 39.30 శాతం, బీజేపీ 17,590 ఓట్లతో 6.70 శాతం ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీల మధ్య 2.89 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ విజయం సాధించింది.


