News April 25, 2024

సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ సన్నిహితుడు…?

image

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీపై అలకగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన భూంరెడ్డి గతంలో హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. నేడో, రేపో చేరే అవకాశం ఉందని టాక్.

Similar News

News July 11, 2025

మెదక్: ఆపరేషన్ ముస్కాన్.. 8 కేసులు నమోదు: ఎస్పీ

image

ఆపరేషన్ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల వద్ద పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.

News July 10, 2025

MDK: ఇద్దరు మహిళలు అదృశ్యం.. కేసు నమోదు

image

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. స్థానిక రెడ్డి కాలనీలో నివాసం ఉండే అక్కల అరుణ (27), ఆమె తోటి కోడలు అక్కల మౌనిక (26) మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 10, 2025

మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.