News January 6, 2026
ఫాల్కన్ MD అమర్‌దీప్ అరెస్ట్

ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను గల్ఫ్ నుంచి ముంబైకి రాగా ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. MNC కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో చేసిన రూ.850 కోట్ల స్కామ్‌లో అమర్‌దీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Similar News
News February 3, 2026
లోక్‌సభలో గందరగోళం.. వాయిదా

అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్‌పై పార్లమెంటులో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ముందు ఉన్న టేబుల్ ఎక్కి విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాపైకి పేపర్లు విసిరారు. దీంతో ఆయన సభను గంటపాటు వాయిదా వేశారు. అటు పార్లమెంటు బయట కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
News February 3, 2026
USతో ట్రేడ్ డీల్ వివరాలు బయటపెట్టాలి: INC

IND-US ట్రేడ్ డీల్ గురించి ట్రంపే ప్రకటన చేశారని ప్రధాని మోదీ కాదని కాంగ్రెస్ పేర్కొంది. మోదీ అభ్యర్థన మేరకే ఈ ఒప్పందం జరిగిందని, డీల్‌లోని వివరాలు వెల్లడించాలని Xలో డిమాండ్ చేసింది. ‘పార్లమెంటును, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి. ఒప్పందంలోని కీలకాంశాలు తెలపాలి. యుద్ధ విరమణ ఒప్పందం లాగే, వాణిజ్య ఒప్పంద ప్రకటననూ ట్రంపే చేశారు. మోదీ అభ్యర్థన మేరకే వాణిజ్య ఒప్పందం జరుగుతోంది’ అని పేర్కొంది.
News February 3, 2026
దేశ భద్రత గురించే నేను మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీ

చైనాతో సరిహద్దు వివాదంపై నిన్న పార్లమెంటులో చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశ భద్రత గురించే తాను మాట్లాడుతున్నానని.. నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు.


