News January 6, 2026

కాకినాడ: తల్లి మందలించిందని ఉరేసుకున్నాడు..!

image

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నివసించే సంగాని సూరిబాబు ఫ్యామిలీతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. తనను తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి(16) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.

Similar News

News February 16, 2026

ఇంత దానికేనా అంత డ్రామా!

image

T20 WCలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచులో వార్ వన్ సైడ్ అయింది. టీమ్ ఇండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక దాయాది తేలిపోయింది. దీంతో టోర్నీకి ముందుకు పాక్ ‘బాయ్‌కాట్’ డ్రామా ఆడింది ఇందుకేనా అంటూ భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి ఇండియాతో ఆడబోమంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. టోర్నీలో USA లాంటి చిన్న జట్లు మంచి పోటీ ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు.

News February 16, 2026

ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

image

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

News February 16, 2026

పాలమూరు వర్సిటీ: రీకౌంటింగ్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఫలితాలపై సందేహాలున్న వారు సబ్జెక్టుకు రూ.300 చొప్పున ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించాలని అధికారులు సూచించారు.