News January 6, 2026

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడులో నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 26,200 వద్ద, సెన్సెక్స్ 60 పాయింట్లు క్షీణించి 85,379 వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా రంగాల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి, డాబర్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC Bank నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, ICICI Bank, టాటా స్టీల్‌ షేర్లపై ఆసక్తి కనిపిస్తోంది.

Similar News

News January 30, 2026

ఉద్యోగులు SM అకౌంట్ తెరవాలంటే అనుమతి తప్పనిసరి!

image

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై బిహార్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులెవరైనా SM ఖాతాను తెరవడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వీటికి అధికారిక ఈమెయిల్, ప్రభుత్వ నంబర్లను వాడరాదు. వారి హోదా, ప్రభుత్వ లోగోను SM పోస్టులలో ఉపయోగించరాదు. నకిలీ ఖాతాలను వాడితే చర్యలు తప్పవు. డిజిటల్ స్పేస్‌లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News January 30, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>బ్యాంక్<<>> ఆఫ్ బరోడా 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech/MCA కంప్యూటర్ సైన్స్/IT/E&C అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, డిప్యూటీ మేనేజర్‌కు 35ఏళ్లు. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: bankofbaroda.bank.in

News January 30, 2026

T20 WC నుంచి బంగ్లా తప్పుకోవడం కరెక్ట్ కాదు: సురేశ్ రైనా

image

భద్రతా కారణాల దృష్ట్యా T20 WC నుంచి తప్పుకుంటూ BCB తీసుకున్న నిర్ణయాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టారు. ‘టోర్నీలో పాల్గొనడానికి బంగ్లా ఇండియాకు వస్తే బాగుండేది. ప్రస్తుతం ఆ జట్టు బలంగా ఉంది. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా రాణించాలో స్పిన్నర్లకు తెలుసు. భారత్‌కు రాకూడదనే నిర్ణయంతో ఆర్థికంగా నష్టపోతారు. సాంస్కృతిక ఆహ్వానాన్ని బంగ్లా ప్లేయర్లు మిస్ అవుతారు’’ అని రైనా పేర్కొన్నారు.