News January 6, 2026
వంటింటి చిట్కాలు

☛ క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్క వేయాలి.
☛ కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త పాల మీగడ కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
☛ పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి.
☛ కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు పోవడంతో పాటు కూర రుచిగా ఉంటుంది.
☛ అప్పడాలను వేయించే ముందు కాసేపు ఎండలో ఉంచితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.
Similar News
News January 25, 2026
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన రేపు ఢిల్లీలో PCCల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్రం MGNREGAను జీ రామ్ జీ బిల్లుగా మార్చిన అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే దిశగా చర్చించనున్నారు. అలాగే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలతో పాటు ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరగనున్నాయి.
News January 25, 2026
శుభాంశు శుక్లాకు అశోక చక్ర

77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. గతేడాది అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లా(పైలట్)కు అశోక చక్ర అవార్డు వరించింది. ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్(గ్యాలంటరీ), 44 మందికి సేనా మెడల్, ఆరుగురికి NAO సేనా మెడల్, ఇద్దరికి వాయు సేనా మెడల్ అందించనున్నారు.
News January 25, 2026
17న ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: వచ్చే నెల 17న రాష్ట్రంలో 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లలు 23 లక్షల మంది ఉన్నారన్నారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని పేర్కొన్నారు.


