News January 6, 2026

‘గ్రీన్‌ల్యాండ్’పై ట్రంప్‌ ఎందుకు కన్నేశారంటే?

image

గ్రీన్‌ల్యాండ్ కావాలన్న US <<18765231>>కోరిక<<>> వెనుక రక్షణతోపాటు అక్కడ దొరికే రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, ఐరన్ కారణమని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి కోరిక కాదు. 1867లో రష్యా నుంచి అలాస్కాని కొన్నప్పుడే దీనిపై సంప్రదించింది. 1946లో $100M ఆఫర్ కూడా చేసింది. ఒకవేళ రష్యా క్షిపణులతో దాడిచేస్తే న్యూక్లియర్ మిస్సైళ్లు పంపేందుకు USకు నార్త్ పోల్, గ్రీన్‌ల్యాండ్ దగ్గర దారి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 6, 2026

ఇంకా చూడాల్సింది.. జయించాల్సింది చాలా ఉంది మిత్రమా!

image

సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏ సమస్యకైనా సూసైడ్ పరిష్కారం కాదని, పోరాడి సాధించాల్సింది ఎంతో ఉందని అంతా గుర్తుంచుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సైకాలజిస్టులను నియమించుకోవాలి. దీనిపై మీరేమంటారు?

News February 6, 2026

కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

image

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్‌ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్‌ను ఎగదోస్తోందని ఆరోపించారు.

News February 6, 2026

మచిలీపట్నం హైవే కారిడార్‌కు ఫండ్స్.. గడ్కరీకి లోకేశ్ థాంక్స్

image

AP: మచిలీపట్నం పోర్టు రోడ్డును NH-216 జంక్షన్‌కు అనుసంధానించే 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి గడ్కరీ SMలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పోర్టు నుంచి హైవేకు సరకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం సహకరిస్తున్న గడ్కరీకి ధన్యవాదాలు అని ఆయన పోస్ట్‌కు మంత్రి లోకేశ్ రిప్లై ఇచ్చారు.