News April 25, 2024

సెకండియర్ ఫలితాల్లో 10వ స్థానంలో నల్గొండ

image

సెకండియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 68.45 శాతంతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. 11,474 మందికి 7854 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లా 62.74 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. 6,063 మందికి 3804 మంది పాసయ్యారు. యాదాద్రి భువనగిరి 62.64 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 4446 మందికి 2785 మంది పాసయ్యారు.

Similar News

News March 13, 2026

సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

image

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2026

టెన్త్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి: కలెక్టర్

image

నూతన ప్రజాప్రతినిధులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.