News January 6, 2026
SRD: పేదరికంలో పుట్టి అంతర్జాతీయ గుర్తింపు!

పర్యావరణ పరిరక్షణ కోసం ఒక వినూత్న సాంకేతిక ప్రయోగం చేసి అంతర్జాతీయ గుర్తింపు (పేటెంట్) పొందారు సిర్గాపూర్ పటేల్ తండాకు చెందిన వెంకట్ నాయక్. పేదరికంలో పుట్టి పట్టుదలతో PHD సాధించారు. హైదరాబాద్లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. పర్యావరణం కాలుష్యం నుంచి కాపాడేందుకు వ్యర్థాలను వేరు చేసే ‘గార్బేజ్ కలెక్షన్ బిన్ ఆన్ వీల్స్’ రూపొందించగా, ఆయనకు భారత్ ప్రభుత్వం హక్కులు కల్పించింది.
Similar News
News January 12, 2026
మేడారం: వాళ్లు కడుతున్నారు.. వీళ్లు పడగొడుతున్నారు!

మేడారం జాతరలో తాత్కాలిక టాయ్‌లెట్ల నిర్మాణం కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. తమ స్థలంలో తాత్కాలికంగా నిర్మిస్తోన్న బయో బూటాన్ టాయ్‌లెట్లను రైతులు కూల్చివేస్తున్నారు. తమ స్థలానికి ప్రభుత్వం ఎలాంటి ధర కట్టివ్వలేదని, తాము పెట్టనివ్వమంటూ కాంట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్న టాయ్‌లెట్లను పడగొడుతున్నారు. చిలుకలగట్టు పరిధిలోని 3 ప్రాంతాల్లో టాయ్‌లెట్లను కూల్చివేయడంతో కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
News January 12, 2026
ఇతిహాసాలు క్విజ్ – 125 సమాధానం

ఈరోజు ప్రశ్న: భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?
జవాబు: దుర్యోధనుడు విషమిచ్చి నదిలో పడేయగా, భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు వాసుకి భీముడిని తన మనువడిగా గుర్తించి, దివ్య రసాన్ని ప్రసాదించాడు. ఆ అమృత రసం తాగడం వల్లే భీముడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతోనే ఆయన ఎందరో బలవంతులను, కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 12, 2026
చిరు-బాలయ్య కాంబో సాధ్యమేనా?

మన శంకరవరప్రసాద్ గారు మూవీలో సీనియర్ స్టార్లు చిరంజీవి, వెంకటేశ్ చేసిన సందడికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ మూవీ చేయాలనుందని గతంలో చిరంజీవి చెప్పారు. రామ్ చరణ్, జూ.NTRతో రాజమౌళి తీసిన RRR ప్రపంచవేదికపై సత్తా చాటింది. ఇప్పుడు చిరు-బాలయ్య సినిమా వస్తే పండగేనని ఫ్యాన్స్ అంటున్నారు. మీరేమంటారు?


