News January 6, 2026
MNCL:విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అవసరం: ఎంపీ

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అత్యంత అవసరమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాలలోని ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ,జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.
Similar News
News January 11, 2026
ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
News January 11, 2026
ములుగు జిల్లా రద్దు నిజమేనా..?

ఆరు ముక్కలుగా విభజించిన ఉమ్మడి వరంగల్ జిల్లాను మళ్లీ అతికించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రచారం జోరందుకోవడంతో వరంగల్, హనుమకొండలను విలీనం చేయడంతో పాటుగా, భూపాలపల్లి జిల్లాలో ములుగును విలీనం చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నో గొడవల నేపథ్యంలో ఏర్పాటైన ములుగు జిల్లాకు మంగళం పాడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
News January 11, 2026
డియర్ పేరెంట్స్.. పిల్లలు జాగ్రత్త

సంక్రాంతికి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసే ఉత్సాహంలో ఉంటారు. ఒకవైపు చైనా మాంజా ప్రమాదకారిగా మారితే.. మరోవైపు విద్యుత్ షాక్‌లు పేరెంట్స్‌ను కంగారు పెడుతున్నాయి. అన్నమయ్య జిల్లా గోరంచెరువు గ్రామంలో గాలిపటం ఎగరవేస్తూ విద్యుత్ తీగలు తగిలి ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. డాబాలు, అపార్ట్‌మెంట్లు కాకుండా ఓపెన్ ప్లేస్, గ్రౌండుకు తీసుకెళ్లి పతంగి ఎగరేయించండి. బాల్కనీల్లో గాలిపటాలు ఎగరేయడం ప్రమాదకరం. ShareIt.


