News January 6, 2026
బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే..

పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ నుంచే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీలో తల్లి శార్డైన్స్, గుమ్మడి గింజలు, పాలకూర, బీట్ రూట్, దానిమ్మ, చికెన్, చిక్కుళ్లు, బ్రెజిల్ నట్స్, పల్లీలు, అవకాడో,గ్రీక్ యొగర్ట్ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, అయొడిన్ పిల్లల బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుందంటున్నారు.
Similar News
News February 16, 2026
T20 WC: సూపర్-8లో భారత్‌కు టఫ్ ఛాలెంజ్!

T20 WCలో టీమ్‌ఇండియా సూపర్-8లో తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. భారత్‌తో పాటు ఇప్పటికే S-8కి అర్హత సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపు(G1)లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా వస్తే ఈ గ్రూప్ టఫ్‌గా మారనుంది. భారత్ FEB 22న SA, 26న AUS లేదా ZIM, మార్చి 1న WIను ఢీకొట్టొచ్చు. అటు గ్రూపు-2లో SL, PAK, NZ, ENG జట్లు తలపడే అవకాశముంది.
News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
News February 16, 2026
విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.


