News April 25, 2024
సెకండియర్ ఫలితాల్లో నారాయణపేటకు 34వ స్థానం

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 64.75శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64.21%తో MBNR 22వ స్థానంలో నిలిచింది. 7909కి 5078 మంది పాసయ్యారు. 62.82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59.06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 4942కి 2918 మంది పాసయ్యారు. 53.81%తో NRPT 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.
Similar News
News March 18, 2026
మహబూబ్‌నగర్: ‘వేసవిలో నీటి సమస్య తలెత్తకూడదు’

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి రాకుండా చూడాలని మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మూడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 60 డివిజన్లలో ఎప్పటికప్పుడు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News March 18, 2026
మన్యంకొండలో వసంత నవరాత్రులు

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 28 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, 28న శ్రీరామ నవమి వేడుకలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 29న శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.
News March 18, 2026
MBNR : ఉడిత్యాలలో 36.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బాలానగర్ 30.8, నవాబుపేట మండలం కొల్లూరు 26.3, మిడ్జిల్ 21.5, నవాబుపేట 15.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 12.5, మహబూబ్ నగర్ అర్బన్ 11.7, జడ్చర్ల 10.3, మహమ్మదాబాద్ 9.3, గండేడ్ మండలం సల్కర్ పేట 5.5, దేవరకద్ర 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.


