News January 6, 2026

వరంగల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

image

వరంగల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రీపీట్ అయ్యింది. వరంగల్ రంగసాయిపేట చెందిన మోహన్ అనే వ్యక్తి శ్వాస సమస్యతో గత డిసెంబర్‌లో ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల చికిత్స అనంతరం కుదుటపడిన మోహన్‌ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కుటుంబ సభ్యులు గత నెల 27 నుంచి అడుగుతున్నా వైద్యులు డిశ్చార్జ్ చేయకుండా ఠాగూర్ సీన్ లాగా వైద్యం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Similar News

News February 22, 2026

రంపచోడవరంలో వివాహిత బలవన్మరణం

image

రంపచోడవరం యర్రంరెడ్డినగర్లో నివాసంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆశాజ్యోతి(28) ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ సన్యాసినాయుడు మీడియాకు తెలిపారు. దేవీపట్నం మండలానికి చెందిన ఆశాజ్యోతి, శివకుమార్ దంపతులు హోటల్ నిర్వహిస్తూ రంపచోడవరంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News February 22, 2026

ధన్వంతరి మంత్రం ఎందుకు పఠించాలి?

image

ధన్వంతరిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారు. ఆయుర్వేద అధిదేవత, దేవవైద్యుడు కూడా ఆయనే. అయితే ఆయన పేరుమీద ఉన్న ధన్వంతరీ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికి భవిష్యత్తులో రోగాలు వ్యాపించకుండా కాపాడుతుందని అంటున్నారు.
మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ! ధన్వంతరయే అమృత కలశ హస్తాయ| సర్వమయ వినాశాయ త్రైలోక్య నాథాయ| ధన్వంతరి మహావిష్ణవే నమః|

News February 22, 2026

933పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2026కు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఏడాది ఆలిండియా సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వేషన్ గలవారికి సడలింపు). ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ మే 24న నిర్వహిస్తారు. సైట్: https://upsc.gov.in