News January 6, 2026
విద్యా వ్యవస్థలో మార్పులతోనే ఉద్యోగాలు!

విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ కోచింగ్ <<18774837>>సెంటర్ల<<>> చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ‘నైపుణ్యాధారిత విద్య’ను అందించాలి. సిలబస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. క్యాంపస్ నుంచే విద్యార్థులు జాబ్స్ సాధించేలా స్కిల్స్ పెరిగితేనే విద్యా వ్యవస్థ సక్సెస్ అయినట్లు. ఏమంటారు?
Similar News
News February 10, 2026
జైలుకి వెళ్లడానికైనా సిద్ధమే: అస్సాం సీఎం

హైదరాబాద్‌లో తనపై అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్ చొరబాట్లపై తాను చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే’ అని పేర్కొన్నారు. కాగా మతపరంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News February 10, 2026
ఢిల్లీ చేరిన సీఎం.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం 1 జన్‌పథ్‌లోని తన నివాసానికి వెళ్లారు.
News February 10, 2026
కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.


