News April 25, 2024
ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం: కడప కలెక్టర్

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 69 ఫిర్యాదులు అందగా, అన్నింటిని పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మంగళవారం విడుదలైన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదిక మేరకు సివిజిల్ ద్వారా మొత్తం 367 కేసులు నమోదు కాగా 224 నిజనిర్ధారణ అయ్యాయని, 143 నిరాధారమైనవిగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 1078 కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News March 4, 2026
కడప JDA చంద్రనాయక్ బదిలీ

కడప జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్(JDA) చంద్ర నాయక్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఆత్మ పీడీగా చంద్రనాయక్‌ను నియమించింది. అక్కడ పనిచేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర రావును కడప జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ (JDA)గా బదిలీ చేశారు.
News March 4, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,512 మంది హాజరు.!

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ మ్యాథమాటిక్స్, సివిక్స్ పరీక్షలు నిర్వహించారు. 12,888 మంది విద్యార్థులకు గాను.. 12,512 మంది పరీక్షలు రాశారు. 375 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 11,738 మందికి గాను.. 11,427 మంది విద్యార్థులు హాజరయ్యారు. 311 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,150 మందికి గాను.. 1,085 మంది పరీక్షలు రాశారు. 65 మంది ఆబ్సెంట్ అయ్యారు.
News March 4, 2026
మైదుకూరు: నోటికాడి ఆహారాన్ని కూడా వదలరా.?

కడప జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి మైదుకూరులో దాడులు చేసి పీడీఎస్‌కు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్ల ముద్ర కలిగిన గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అక్రమార్కులు బడి పిల్లలు, పసి పిల్లల అన్నాన్ని సైతం వదలకుండా అమ్ముకుంటున్నారు.


