News January 6, 2026
UPDATE: కామారెడ్డి.. ఏసీబీ వలలో తహశీల్దార్

జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. నాగిరెడ్డిపేట తహశీల్దార్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపింది. తాండూరు వాసి తన పని నిమిత్తం MROను సంప్రదించగా, ఆ పని పూర్తి చేయడానికి శ్రీనివాస్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. మంగళవారం బాధితుడి నుంచి శ్రీనివాస్ రూ.10 వేలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
Similar News
News February 9, 2026
ఏర్పేడు: రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తులు

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్ (RA-01) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D డిగ్రీ ఇన్ కెమికల్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/advt_102026/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 16.
News February 9, 2026
తిరుపతి: విచారణ కమిటీ నివేదిక చేరిందా..?

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు పెను దుమారం రేపింది. బాధితురాలు రోజుకో వీడియో విడుదల చేస్తోంది. కాగా ఆమె తాజాగా పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ వీడియో విడుదల చేసింది. జనసేన పార్టీ వేసిన విచారణ కమిటీ విచారణ చేసి వారం గుడుస్తున్నా ఇంతవరకు దానిపై ఎలాంటి ప్రకటన లేదు. కమిటీ నివేదిక ఇచ్చిందా లేదా? ఎమ్మెల్యే పై చర్యలు ఉంటాయా? అన్న చర్చ నడుస్తోంది.
News February 9, 2026
క్లీనింగ్ టిప్స్..

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్‌రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.


