News April 25, 2024

ఇంటర్ ఫలితాలు.. 470కి 468 మార్కులు

image

TG: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన వలకొండ చర్విత సత్తా చాటింది. ఎంపీసీలో ఆమెకు 470 మార్కులకు 468 వచ్చాయి. ఇంగ్లిష్‌లో 99(థియరీ 79, ప్రాక్టికల్స్ 20), సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1Aలో 75, మ్యాథ్స్ 1Bలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. దీంతో చర్వితపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Similar News

News March 27, 2026

అలా అయితే ధోనీ IPL ఆడొద్దు: అశ్విన్

image

IPL-2026లో CSK లెజెండ్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ ప్లేయింగ్-11లోనే ఉండాలి. 3 నెలల నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడగలననే నమ్మకం ఉంది కాబట్టే అలా చేశారు. ఒకవేళ తుది జట్టులో లేకపోతే టోర్నీ మొత్తానికే ఆడకూడదు. ఫీల్డ్‌లో ఉంటే కెప్టెన్ రుతురాజ్‌కు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ధోనీకి ఆడాలని లేకపోతే రిటైర్ అవుతారు’ అని అభిప్రాయపడ్డారు.

News March 27, 2026

పెళ్లయిన వ్యక్తి మరొకరితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

image

పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నైతికత, చట్టం వేర్వేరు అని పేర్కొంది. చట్టం ప్రకారం నేరం రుజువు కానప్పుడు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం తీసుకునే చర్యలను సామాజిక అభిప్రాయాలు, నైతికత నిర్దేశించలేవంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది.

News March 27, 2026

నైవేద్యంగా వడపప్పు, పానకం.. ఎందుకంటే?

image

శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం నైవేద్యంగా ఇవ్వడం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుండటంతో ఈ బెల్లంతో చేసిన పానకం ‘ఎనర్జీ డ్రింక్’లా పనిచేస్తుంది. నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. రాముడికి ఇష్టమైన ఈ సాత్విక ఆహారాన్ని శ్రీరామనవమి నాడు సమర్పిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.