News January 6, 2026

మిక్స్డ్ టైప్ స్కిన్‌కు ఈ ఫేస్ ప్యాక్

image

కొన్నిసార్లు జిడ్డుగా, మరొకసారి పొడిబారినట్లుండే చర్మతత్వం కొందరిలో కనిపిస్తుంది. దీన్నే మిక్స్డ్ టైప్ స్కిన్‌ అంటారు. ఇలాంటి తత్వం ఉన్నప్పుడు చర్మం డల్‌గా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఒక గుడ్డు తెల్లసొనకు తేనె, చెంచా నారింజ రసం, పావుచెంచా పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు. ముఖ చర్మమంతా ఒకేలా మెరుపులీనుతుంది. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయడం మంచిది.

Similar News

News February 4, 2026

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్: CM

image

AP: నెట్ జీరో కాన్సెప్టుతో అన్ని వనరులను సమగ్రంగా వినియోగించుకొని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను ముందుకు తీసుకెళ్లాలని CM CBN ఆదేశించారు. బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చే పథకాలకు రూపకల్పన చేయాలని బీసీ వెల్ఫేర్ సమీక్షలో సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు యోచిస్తున్నామన్నారు. ఆదరణ-3 ద్వారా కుల వృత్తుల వారీగా ఆధునిక పనిముట్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

News February 4, 2026

ఢిల్లీలో కలకలం: 15 రోజుల్లో 807 మంది అదృశ్యం

image

దేశ రాజధాని ఢిల్లీలో 15 రోజుల్లో ఏకంగా 807 మంది అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. JAN 1-15 మధ్య మహిళలు, బాలికలు 509 మంది, 298 మంది పురుషులు కనిపించకుండా పోయినట్లు కేసులు నమోదయ్యాయి. వీరిలో 196 మంది మైనర్లుండగా వారిలో 146మంది బాలికలే. 2025లో ఢిల్లీలో మొత్తం 24,508 మంది తప్పిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. అందులో 14,870 మంది మహిళలున్నారు. 15,421 మంది ఆచూకీ తెలియగా మిగతా వారి జాడ ఇప్పటికీ తేలలేదు.

News February 4, 2026

పదిలమైన ఇంటికి పంచ సూత్రాలు

image

ఇల్లు పదిలంగా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ‘పంచసూత్రాలు’ సూచిస్తున్నారు. అవి 1. సరైన వాస్తుతో స్థలం ఎంపిక, 2. పనుల నిర్వహణకు పక్కా ప్లానింగ్, 3. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే బలమైన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, 4. అవసరాలకు అనుగుణంగా వస్తువుల అమరిక తెలిపే ఇంటీరియర్ డిజైన్, 5. ఇంటి అందాన్ని పెంచే ఇంటీరియర్ డెకరేషన్. ఈ 5 అంశాల మేళవింపుతోనే ఇల్లు సేఫ్‌, అందంగా ఉంటుందని ఆయన అంటున్నారు. <<-se>>#Vasthu<<>>