News January 6, 2026

FLASH: హైదరాబాద్ ఘన విజయం

image

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బరిలోకి దిగిన HYD జట్టులో ఓపెనర్ అమన్ రావు 200* చెలరేగాడు. రాహుల్ సింగ్ (64), తిలక్ వర్మ (34) రాణించారు. 352 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగాల్ 245 పరుగులకే కుప్పకూలింది. కాగా, తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత HYD వరుసగా 2వ విజయం నమోదు చేయడం విశేషం.

Similar News

News January 30, 2026

HYD: ఫైర్ సేఫ్టీ లేకుంటే కాల్ చేయండి: రంగనాథ్

image

ఏదైనా వాణిజ్య సముదాయం, భవనం, దుకాణం, షోరూమ్స్ ఫైర్ సేఫ్టీ లేనట్లు గమనించినా, నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించినా తక్షణం హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667, 7207923085 నంబర్లలో సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపించాలని, ‘Commissioner& HYDRAA’ హ్యాష్ ట్యాగ్‌తో Xలో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ కోరారు.

News January 30, 2026

HYD: రూ.3,405 కోట్ల పనులకు ఆమోదం

image

జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిపోనున్న తరుణంలో దాదాపు రూ.3,405 కోట్ల పనులకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 53 అంశాలను అజెండాలో చేర్చగా ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం అద్దె తగ్గింపు వ్యవహారం తప్ప మిగతావాటిని ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్, సభ్యులు తదితరులు ఉన్నారు.

News January 30, 2026

DANGER: HYDలో బతకడం కష్టమే..!

image

హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. గాలి నాణ్యత విషయంలో HYD తాజాగా బెంగళూరు, చెన్నై నగరాలను దాటినట్లు కాలుష్య నియంత్రణ మండలి (PCB) వెల్లడించింది. మెట్రో నగరాల కాలుష్య గణాంకాల్లో హైదరాబాద్ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. గతంలో నగరంలో 7 కాలుష్య హాట్‌స్పాట్లు ఉన్నాయని, ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారుతోందని అధికారులు తెలిపారు. కాగా ఇవాళ గాజులరామారంలో ఉదయం AQ 394గా నమోదైంది.