News January 6, 2026
కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు: మంజ్రేకర్

విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో ఆడటాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. ‘టెస్టుల్లో జో రూట్ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాడు. కానీ విరాట్ టెస్టులను వదిలేశాడు. రిటైర్మెంట్‌కు ముందు అతడు ఇబ్బందిపడటం నిజమే. కానీ ఎందుకు విఫలమవుతున్నాడనేది మనసు పెట్టి ఆలోచించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు ఈజీ ఫార్మాట్ అయిన వన్డేలను కోహ్లీ ఎంచుకోవడం నిరాశకు గురిచేసింది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 10, 2026
MLA, MLCలకు క్రీడలు: అయ్యన్న

AP: MLA, MLCలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఇవి జరుగుతాయన్నారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, చెస్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. క్రీడలన్నీ అసెంబ్లీ ప్రాంగణంలోనే జరగనున్నాయని తెలిపారు.
News February 10, 2026
రైల్వే జోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి: CBN

కొత్త రైలు మార్గాలకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు CM చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందచేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్లపై భేటీలో ప్రస్తావించారు. ‘ద.కో.రైల్వేజోన్ కార్యకలాపాలు APR1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలి. TPT మీదుగా VJA-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీస్ నడపాలి’ అని కోరారు.
News February 10, 2026
పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పుస్తకం

పబ్లిష్ కూడా కాకుండానే ఒక పుస్తకం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19098532>>రాసిన <<>>‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ బుక్ ఏకంగా పార్లమెంట్ సమావేశాలనే స్తంభింపజేసింది. ఒకరోజు PM సభకు రాకుండా చేసింది. ఈ వివాదం LS స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకు సభకు రావద్దని తాజాగా ఆయన నిర్ణయించుకున్నారు.


