News January 6, 2026

HYD: జనవరి 8, 9న నీటి సరఫరా బంద్!

image

HYDలో పలు చోట్ల నీటి సరఫరా బంద్ కానుంది. JAN 8న ఉదయం 10 గంటల నుంచి JAN 9న తెల్లవారుజామున 4 గంటల వరకు సింగూరు ప్రాజెక్ట్ మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ కారణంగా మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఫతేనగర్, బాలానగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో 18 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని HMWSSB తెలిపింది.

Similar News

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.