News April 25, 2024
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన శ్లోక

రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. స్థానిక ఎంప్లాయిస్ కాలనీకి చెందిన తమ్మల-గంగన్న దివ్యల కూతురు తమ్మల శ్లోక బైపీసీ విభాగంలో 440 మార్కుల కు గాను 432 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రాణించింది. రాష్ట్ర స్థాయిలో రాణించిన శ్లోకను పలువురు అభినంధించారు.
Similar News
News March 7, 2026
సైబర్ సైబర్ నేరగాళ్ల అరెస్ట్: ADB CI

ఆదిలాబాద్ స్థానిక కెనరా బ్యాంక్ కరెంట్ ఖాతా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌సీఆర్‌పీ డేటా విశ్లేషణలో ఈ ఖాతాకు దేశవ్యాప్తంగా 146 ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు CI నాగరాజు వెల్లడించారు. నిందితులు రాజవర్ధన్, శ్రీ అక్షయ్, రాజేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News March 6, 2026
9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.
News March 6, 2026
ఉట్నూర్: ATCలో షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్‌లో భాగంగా నిర్వహించే అఖిల భారత వాణిజ్య పరీక్ష షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ కేటగిరీల వారీగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలకు నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.


