News January 6, 2026

స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు: ఆర్టీసీ

image

AP: సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో జిల్లాల్లో 8,432 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. పండుగకు ముందు HYDకు 240, బెంగళూరుకు 102, చెన్నైకి 15 బస్సులు, పండుగ తర్వాత HYDకు 2,028, బెంగళూరుకు 278, చెన్నైకి 70 బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.

Similar News

News February 15, 2026

హసీనా అప్పగింతపై BNP ఆశాభావం

image

షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందని ఇటీవల బంగ్లా ఎన్నికల్లో గెలిచిన BNP ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు అడ్డుగా మారకూడదని ఆ పార్టీ నేత మీర్జా ఫక్రుల్ చెప్పారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆమెను అప్పగించాలని ఇప్పటికే INDను కోరినట్లు తెలిపారు. బంగ్లాలో అల్లర్ల కారణంగా 2024లో హసీనా పారిపోయి భారత్‌కు వచ్చారు. తర్వాత ఢాకా అల్లర్ల కేసులో అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.

News February 15, 2026

TODAY HEADLINES

image

* రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
* రూ.57,868 కోట్లతో అమరావతి పనులు: పయ్యావుల
* బిల్ గేట్స్‌ను 3సార్లు APకి తీసుకొచ్చింది నేనే: CBN
* బడ్జెట్ ప్రసంగంలో భజనే ఉంది: బొత్స
* దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది: మోదీ
* USతో డీల్.. ‘టెక్స్‌టైల్’కు ఉరితాడు: రాహుల్
* ‘మున్సిపల్’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రేవంత్
* TG: 17న ‘రైతు భరోసా’?
* TG: కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు

News February 15, 2026

రేపు పాక్‌పై అభిషేక్ సునామీ!

image

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్‌పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్‌పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్‌రేట్‌తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్‌కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.