News January 6, 2026
HYD: కొత్తగా వర్క్ ఫ్రమ్ విలేజ్!

గజ్వేల్, చౌటుప్పల్ వంటి పల్లెలు ఇకపై వ్యవసాయానికే పరిమితం కావు. గ్రిడ్ పాలసీ పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో 10Gbps ఇంటర్నెట్, సోలార్ పవర్ హబ్‌ను ప్రతిష్ఠిస్తోంది. T-Fiber నెట్‌వర్క్‌ను విద్యుత్ పోల్స్ ద్వారా ప్రతి ఇంటికీ అనుసంధానించడం వల్లే ఇది సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. IT కోసం హైటెక్స్ వెళ్లకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని విదేశీ ప్రాజెక్టులు చేసేలా ‘వర్క్ ఫ్రమ్ విలేజ్’ ప్లాన్ ఇది.
Similar News
News February 5, 2026
HYD: హైడ్రా కమిషనర్‌తో ప్రతి శనివారం PHONE IN

ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతి శనివారం ‘ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి అదనంగా, ఇకపై శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కమిషనర్ రంగనాథ్ ఈ ప్రోగ్రాంలో అందుబాటులో ఉంటారు. చెరువులు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ORR పరిధిలోని ప్రజలు 040- 29565750, 040- 29565759 నంబర్లకు ఫోన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
News February 5, 2026
HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
News February 5, 2026
HYD: పిల్లలనూ వదలని ‘CANCER భూతం’..!

నగరంలోని ప్రధాన క్యాన్సర్ చికిత్స కేంద్రాల వద్ద రోజురోజుకూ క్యాన్సర్ బాధితుల క్యూ పెరుగుతోంది. 2023లో సగటున 15,000 మంది బాధితులు రేడియేషన్ థెరపీ కోసం వస్తే, 2024లో ఆ సంఖ్య 22,000కు చేరింది. ఇక 2025 అక్టోబర్ నాటికి ప్రభుత్వ దవాఖానాల్లో రిఫరల్ కేసుల సంఖ్య 3,500 దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లల CANCER కేసులు గత ఐదేళ్లతో పోలిస్తే 12% వృద్ధి చెందడం తీవ్ర ఆందోళనకరం.


