News January 6, 2026

PDPL: అనాథ పిల్లలందరూ చదువుకోవాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, పిల్లల తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులను వారికే దక్కేలా చూడాలన్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, బాలసదనంలో మెరుగైన వసతులతో పాటు బెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 23, 2026

INC: అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు

image

ప్రతిపక్షంగా NDAపై పోరాడాల్సిన INC అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో సిద్దరామయ్య, శివకుమార్‌ల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఝార్ఖండ్‌లో JMMతోనూ విభేదాలున్నాయి. అస్సాం, బిహార్లలో సీనియర్ నేతలు భూపేన్ కుమార్, షకీల్ అహ్మద్ రాజీనామా చేశారు. WBలో ఉనికి కోల్పోగా, GJ, UPలోనూ అదే స్థితికి చేరుతోంది. TNలో సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు. అటు కేరళలోనూ ఇంటర్నల్ విభేదాలున్నాయి.

News February 23, 2026

ఎండల్లో వర్షాలు.. పొంచి ఉన్న జ్వరాల ముప్పు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పగటిపూట ఎండలు దంచికొడుతుండగా రెండ్రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇలా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తాజా ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News February 23, 2026

గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

image

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.