News January 6, 2026

తిరుమ‌ల‌లో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీ నిలిపివేత‌

image

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్‌లైన్ జారీని 9వ తేదీ నుంచి TTD నిలిపి వేయనుంది. రోజువారీ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇకపై రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిలో 800 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఒక కుటుంబానికి 1+3(మొత్తం 4 మంది) వరకే అనుమతి ఉంటుంది. తిరుపతి విమానాశ్రయంలో యథావిధిగా 200 టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇస్తారు.

Similar News

News January 17, 2026

ఎయిర్ ‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్ ‌పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్ కంపెనీ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, ICWA అర్హతతో పాటు పని అనుభవం గల వారు FEB 15వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60K, మేనేజర్ పోస్టుకు రూ.70K చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.aai.aero

News January 17, 2026

ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.