News January 6, 2026
ఆహార భద్రతపై పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్

భువనగిరి: జిల్లాలో ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం డిస్ట్రిక్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు నిత్యం వినియోగించే ఆహార పదార్థాలు కల్తీ కాకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News January 14, 2026
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.
News January 14, 2026
కొందరి పౌరసత్వ నిర్ధారణ కోసం ఎన్నికల ప్రక్రియను ఆపలేము: ECI

పౌరసత్వం తేలేవరకు ఓటు హక్కును తొలగించవచ్చా? అని ECని SC ప్రశ్నించింది. SIR వ్యాజ్యంపై CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారించారు. ‘పౌరసత్వంపై కేంద్రానికి నివేదించి EC నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్రం తేల్చే వరకు వేచి ఉండకుండా EC నిర్ణయం తీసుకోవచ్చు. ఓటరు పేరు తొలగించొచ్చు. దానిపై సదరు వ్యక్తి అప్పీలు చేయొచ్చు’ అని EC న్యాయవాది ద్వివేది కోర్టుకు తెలిపారు. దీనికోసం ఎన్నిక ప్రక్రియ ఆపలేమన్నారు.
News January 14, 2026
హనుమకొండ ఖాళీ.. నిర్మానుష్యంగా రోడ్లు!

సంక్రాంతి సందర్భంగా హనుమకొండ నగరం ఖాళీ అయింది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పట్టణ ప్రజలంతా పండగ కోసం పల్లెబాట పట్టారు. నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతం, పెట్రోల్ పంప్ ఏరియా ఖాళీగా కనిపించింది. పట్టణ ప్రజలంతా గ్రామాల్లోకి వెళ్లడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


