News January 6, 2026
అటవీ ప్రాంతాల్లో రోడ్డు పనుల అనుమతులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల మీదుగా ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ సంరక్షణ చట్టాల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు.
Similar News
News February 6, 2026
ADB: బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వెరిఫికేషన్ ప్రక్రియ పరిశీలన

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జడ్పీ కార్యాలయంలోని ముద్రణాలయం, స్ట్రాంగ్ రూమ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. బ్యాలెట్ పేపర్ల నాణ్యత, అక్షర దోషాలు లేకుండా ముద్రణ జరుగుతుందా, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.
News February 6, 2026
ఆదిలాబాద్: భారత సైన్యంలో చేరడం గౌరవప్రదం

భారత సైన్యంలో చేరడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక గౌరవప్రదమైన జీవనశైలి అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు మార్గదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్(ARO) ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రేరణాత్మక ఉపన్యాసాన్ని ఇచ్చారు.
News February 6, 2026
ఆదిలాబాద్: ఎన్నికల్లో POలు, APOల పాత్ర కీలకం

మున్సిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO) కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా హాజరై మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో POలు, APOల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశానికి ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహించాలన్నారు.


