News April 25, 2024

సింహాచలం ఆలయ ప్రాంగణంలో వినోదాత్మక సన్నివేశం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం వినోదాత్మక సన్నివేశం జరిగింది. సింహాద్రి అప్పన్న ఉంగరం పోయింది.. ఎవరు తీశారంటూ.. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంటల శ్రీనుబాబుతో పాటు పలువురు భక్తులను విచారించారు. కొందరు భక్తులు ఇది నిజమేననుకుని కంగారుపడ్డారు. చివరకు పట్టు వస్త్రాల్లో దొరికిందని ఆలయ అర్చకులు ప్రకటించారు.

Similar News

News April 23, 2025

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజు

image

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే.రాజును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే కేకే.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందరు.

News April 23, 2025

విశాఖ: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

బుధవారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విశాఖలో 29,997 మంది పరీక్ష రాయగా వారిలో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 28,523 మంది, ఓపెన్ స్కూల్ 1,404 మంది, 2,124 వృత్తి విద్యా పరీక్ష రాశారు. 134 సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

News April 22, 2025

విశాఖ: ఈనెల 28న GVMC మేయర్ ఎన్నిక

image

GVMC మేయర్ పదవికి ఎన్నికను ఏప్రిల్ 28న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈనెల 24లోపు మేయర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 28 ఉదయం 11 గంటలకు GVMCలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

error: Content is protected !!