News January 6, 2026
HYD ఈస్ట్ రెసిడెన్స్‌కు గుడ్ న్యూస్!

HYD ఈస్ట్ ప్రాంత వాసుల సీవరేజ్ వాటర్ కష్టాలకు చెక్ పడనుంది. నాగోల్‌లోని 320 MLD ప్లాంట్ ఆధునీకరణకు జలమండలి రూ.3.83 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్ హీ అమృత్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అత్యాధునిక యంత్రాలతో ట్రంక్ సీవర్ల పూడికతీత, నాలాల రక్షణ గోడల మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో మురుగు వాసన తగ్గడమే కాకుండా, శుద్ధి చేసిన నీటిని రీసైక్లింగ్ చేసి వాడుకునే వీలుంటుంది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్డ్ వైద్యం అందించనున్నారు.