News January 6, 2026
పేద ఖైదీలకు సహాయం పథకం అమలు చేయాలి: కలెక్టర్

‘పేద ఖైదీలకు సహాయం’ పథకం అమలును మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం DLSA కార్యదర్శి రాజశేఖర్, ఎస్పీ సతీష్ కుమార్‌తో కలెక్టర్
తన కార్యాలయంలో మాట్లాడారు. పేద ఖైదీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా జైల్లోనే ఉండిపోకుండా న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 13, 2026
విశాఖలో వాహనదారులకు అలర్ట్

విశాఖలో వాయు కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ‘నో పొల్యూషన్ సర్టిఫికేట్ – నో ఫ్యూయల్’పై టైకూన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు వాహనదారులకు దీనిపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లో ఇబ్బందులు రాకుండా.. జరిమానాలు పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని త్రీ టౌన్ సీఐ అమ్మి నాయుడు తెలిపారు.
News January 13, 2026
తమిళ సంస్కృతిపై దాడి.. ‘జన నాయగన్’ జాప్యంపై రాహుల్

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలలో జాప్యంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చిత్రానికి అడ్డంకులు సృష్టించడం ‘తమిళ సంస్కృతిపై దాడి’ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ తమిళ ప్రజల గొంతును ఎప్పటికీ నొక్కలేరని Xలో పోస్ట్ చేశారు. దీనిపై BJP స్పందిస్తూ రాహుల్ అబద్ధాల కోరు అని.. గతంలో జల్లికట్టును ‘అనాగరికమైనది’గా పేర్కొన్న కాంగ్రెస్సే తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించింది.
News January 13, 2026
తిరుపతి: ఈ నంబర్ సేవ్ చేసుకోండి

తిరుపతి జిల్లాలో జల్లికట్టు, కోడిపందేలు, పేకాట పూర్తిగా నిషేధమని.. ఎక్కడా నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. ఎక్కడైనా వీటిని నిర్వహిస్తే ప్రజలు వెంటనే 112, వాట్సాప్ నంబర్ 8099999977కు మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.


