News January 7, 2026

స్మిత్ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు

image

యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 5,085 రన్స్ చేశారు. తర్వాతి స్థానాల్లో బ్రాడ్‌మాన్(AUS-5,028), బోర్డర్(AUS-4,850) ఉన్నారు. మరోవైపు అత్యధిక శతకాల జాబితాలో సచిన్(51), కల్లిస్(45), పాంటింగ్(41), రూట్(41), సంగక్కర(38) తర్వాతి స్థానంలో స్మిత్(37) ఉన్నారు.

Similar News

News February 8, 2026

అమెరికాపై భారత్ ఘన విజయం

image

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. USAతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా ఛేదనలో తడబడింది. బౌలింగ్‌లో మెప్పించినా బ్యాటింగ్‌లో తేలిపోయింది. శుభం(37), సంజయ్ కృష్ణమూర్తి(37), మిలింద్(34) మినహా ఎవరూ రాణించలేకపోయారు. IND బౌలర్లలో సిరాజ్ 3, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.

News February 7, 2026

భారత్‌లోకి GM పంటలు? USతో డీల్‌పై RSS అనుబంధ సంస్థ ఫైర్!

image

USతో ట్రేడ్ డీల్‌లో భాగంగా తక్కువ ధరకు DDGS దిగుమతులను అనుమతించడంపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది జన్యుమార్పిడి (GM) పంటలను భారత్‌లోకి దొడ్డిదారిలో ప్రవేశపెట్టే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. దీనివల్ల దేశీయ సోయాబీన్ రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. RSS అనుబంధ BKS మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

News February 7, 2026

Vi నుంచి అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్!

image

వొడాఫోన్ ఐడియా (Vi) ‘నాన్-స్టాప్ హీరో’ పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోజువారీ పరిమితి లేకుండా కాల్స్, అన్‌లిమిటెడ్ 4G/5G డేటా & 100 SMSలు లభిస్తాయి. ముఖ్యంగా రూ.365 (28 రోజులు), రూ.649 (56 రోజులు), రూ.979 (84 రోజులు) ప్లాన్లతో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. కొన్ని ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి.