News January 7, 2026

కవిత రాజీనామాకు ఆమోదం

image

TG: కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2025 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. నిన్న మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Similar News

News February 16, 2026

రేపు స్కూళ్లలో ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

AP: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరగనుంది. 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. 400MG ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని అధికారులు పేర్కొన్నారు.

News February 16, 2026

FLASH: మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న 9AM-7.30PM మధ్య శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు TTD అదనపు EO వెంకయ్య చౌదరి వెల్లడించారు. 5AM నుంచి 10AM వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఆ తర్వాత అన్నిరకాల దర్శనాలను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున 3.20PM నుంచి 6.47PM వరకు గ్రహణం ఉంటుందన్నారు.

News February 16, 2026

PM RAHAT స్కీమ్.. వివరాలివే

image

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు కేంద్రం PM RAHAT స్కీమ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కింద ₹1.5లక్షల వరకు ఉచిత(క్యాష్‌లెస్) చికిత్స అందనుంది. ప్రమాదం జరిగిన 7days వరకు ఇది వర్తిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎమర్జెన్సీ నంబర్(112)కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి బాధితుల్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుంది. ఈ పథకానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.