News January 7, 2026
త్వరలో భద్రాచలంలో ‘గిరి మాల్’ ఏర్పాటు: పీఓ

గిరిజనులకు ప్రకృతి సిద్ధంగా లభించే అటవీ ఉత్పత్తులతో పాటు అన్ని రకాల వస్తువులను ఒకేచోట అందించేలా గిరి మాల్‌ను ప్రారంభించనున్నట్లు ITDA పీవో బి.రాహుల్ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో DRDA, ITDA, ITC అధికారులతో దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి ఈ మాల్ ఎంతో దోహదపడుతుందని పీఓ పేర్కొన్నారు. ఏర్పాటుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 11, 2026
వరంగల్‌లో ఇండోర్ స్టేడియంకు నిధులివ్వండి: రాఘవరెడ్డి

వరంగల్ జిల్లాలో ఇండోర్ స్టేడియంకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కోరారు. రాష్ట్రంలో ఉద్యోగాలలో స్పోర్ట్స్‌కు రిజర్వేషన్లను తీసుకురావాలన్నారు. స్టేడియంకు ఎస్టిమేట్స్ తీసుకువస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News January 11, 2026
మహానందిలో గిరిజన పాఠశాల విద్యార్థి మృతి

మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విజయ్ కుమార్ తలకు కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్(13) కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు మహానంది పోలీసులు తెలిపారు. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
News January 11, 2026
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. NZతో తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. సచిన్ 34,357 (782 ఇన్నింగ్సులు) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, కోహ్లీ 28,027* (624 ఇన్నింగ్సులు) రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత వేగంగా 28వేలకు పైగా రన్స్ (సచిన్ 644 ఇన్నింగ్సులు) చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచారు.


