News January 7, 2026
మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.
Similar News
News March 10, 2026
మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.
News March 10, 2026
ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 10, 2026
మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


