News January 7, 2026
అనకాపల్లి: బీఎల్వోలకు నోటీసుల జారీ

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వెల్లడించారు. ఎలమంచిలిలోని పోలింగ్ కేంద్రం-46, అచ్యుతాపురం మండలం ఆవ సోమవారంలోని 203, పూడిమడకలోని 228 కేంద్రం పరిధిలోని బీఎల్వోలు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి నోటీసులు జారీ చేశారు.
Similar News
News January 17, 2026
IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్‌తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.
News January 17, 2026
TU: ఈ నెల 21 నుంచి పరీక్షలు

టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH)-3, 5, IMBA-3, 5, LLB, LLM-3, B.Ed, B.P.Ed-1,3వ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. LLB పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు, LLM పరీక్షలు ఈ నెల 21, 23 తేదీల్లో, ఇంటిగ్రేటెడ్ PG, IMBA పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు B.Ed పరీక్షలు 21 నుంచి 31 వరకు, B.P.Ed 21 నుంచి 24 వరకు జరగనున్నాయి.
News January 17, 2026
ఉమ్మడి వరంగల్‌లో 260 వార్డులకు రిజర్వేషన్లు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 260 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 260 వార్డుల్లో 21 వార్డులు ఎస్టీల జనరల్‌కు, ఎస్టీ(మ) 15, ఎస్సీ(జ) 26, ఎస్సీ(మ) 18, బీసీ(మ) 29, బీసీ(జ) 21, జనరల్ 75, జనరల్ మహిళకు 56 వార్డులను రిజర్వ్ చేశారు. మున్సిపాలిటీలతో పాటుగా గ్రేటర్ వరంగల్ డివిజన్లకు రిజర్వేషన్లు చేశారు.


