News January 7, 2026
PDPL: విద్యాశాఖలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

విద్యాశాఖలో చేపట్టిన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ZPHS, KGBV, పీఎంశ్రీ పాఠశాలలు, కళాశాలల పనుల పురోగతిని సమీక్షించారు. శాతవాహన వర్సిటీ అడ్మిన్ బ్లాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిధుల వినియోగంలో జాప్యం ఉండకూడదని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 18, 2026
జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్‌లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.

చేర్యాల: కొత్త పాలకవర్గాలకు సమస్యల స్వాగతం

చేర్యాల, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలకు సమస్యలు సవాల్‌గా మారాయి. చేర్యాలలో అధ్వాన్నమైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలు వేధిస్తుండగా, గజ్వేల్‌లో R&R కాలనీ ఇబ్బందులు తొలగలేదు. దుబ్బాకలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండగా, హుస్నాబాద్‌లో అంతర్గత రోడ్ల అభివృద్ధి పెండింగ్‌లో ఉంది. ఎన్నికల హామీల అమలు, మౌలిక వసతుల కల్పనపై కొత్త నేతలు దృష్టి సారించాలనికోరుతున్నారు.