News January 7, 2026
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 14, 2026
అధికంగా వసూలు చేయరాదు: కలెక్టర్

శ్రీశైలంలోని కళ్యాణ కట్టనందు నిర్ణయించిన ఛార్జీల కన్నా అధికంగా వసూలు చేయరాదని, భక్తులకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె సమగ్రంగా పరిశీలించారు. కళ్యాణ కట్ట (ముండన మండపం) వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను స్వయంగా సందర్శించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 14, 2026
ఇన్‌స్టాగ్రామా.. ఛేంజింగ్ రూమా?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో అశ్లీలం హద్దుమీరింది. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట కొందరు అమ్మాయిలు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. లైక్‌ల కోసం డ్రెస్ ఛేంజింగ్ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంటున్నారు. ‘మరింత’ చూపిస్తామంటూ సబ్‌స్క్రిప్షన్ పేరిట బరితెగిస్తున్నారు. ప్రైవసీకి సంబంధించిన దృశ్యాలు ఇలా బజార్లో పెడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వీడియోలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
News February 14, 2026
కేయూ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం!

కేయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఫలితాలు విడుదలై 2 రోజులు కావస్తున్నా కొన్ని కళాశాలల విద్యార్థుల ఫలితాలు కానరావడం లేదు. ఓల్డ్ విద్యార్థులకు అనుమతులిచ్చిన అధికారులు వారు ఫీజులు చెల్లించలేదని ఆయా కళాశాలల రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలను నిలిపివేశారు. అన్ని ఫీజులు చెల్లించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఫలితాలను నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.


