News January 7, 2026

MLA అభ్యర్థి నిర్మలనే: జగ్గారెడ్డి

image

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ మాజీ MLA జగ్గారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారానికి తనను పిలవద్దన్నారు. భవిష్యత్ MLA అభ్యర్థి తన భార్య నిర్మలనే అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కోసం తన దగ్గరకు రావొద్దన్నారు. సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్, వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా షఫీహఫీజ్ ఉంటారన్నారు.

Similar News

News February 4, 2026

సిద్దిపేట: ‘పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల్లో జాప్యం చేయరాదని, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా ముగించాలని స్పష్టం చేశారు.

News February 4, 2026

వనపర్తి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు తనిఖీ

image

శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల శాంతికి భంగపరిచే ప్రయత్నాలు ఏవైనా కఠిన చర్యలు తప్పవన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

News February 4, 2026

అన్నమయ్య: ‘నాకు ఎటువంటి సమాచారం రాలేదు’

image

MLA అరవ శ్రీధర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జనసేన ఓ విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఎదుట MLA శ్రీధర్ హాజరయ్యారు. అయితే ఈ విచారణకు మీరెందుకు హాజరుకాలేదని ఆరోపణలు చేసిన మహిళను ప్రశ్నించగా.. తనకి ఎటువంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.