News January 7, 2026
ఎన్టీఆర్: విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 5 నుంచి నిర్వహిస్తామని, ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 27లోపు, రూ.100 ఫైన్‌తో 28లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
Similar News
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
SRD: అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన మహిళ

జహీరాబాద్ మున్సిపల్‌లో జరిగిన ఎన్నికల్లో అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఒక మహిళ తమ ఓటు హక్కును అంబులెన్స్‌లో వచ్చి వినియోగించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించలేని పరిస్థితిని గమనించిన ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అంబులెన్స్‌లో ఓటు వేసేలా సౌకర్యం కల్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటు వేయాలనే తపనతో వచ్చిన ఆమెను ఆర్డీవో అభినందించారు.


