News January 7, 2026

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా రామాంజనమ్మ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా లేపాక్షి మండలానికి చెందిన రామాంజనమ్మను TDP అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు అందాయి. రామాంజనమ్మ మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత. కాగా, ఆమె ZPTCగా కూడా పనిచేశారు. ఇటీవల TDPలో రాష్ట్ర మహిళా కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలను గుర్తించిన అధిష్ఠానం రామాంజనమ్మను ఏసీసీ కమిషన్ సభ్యురాలుగా ఎంపిక చేసింది.

Similar News

News January 27, 2026

NTR: సేవలు ఘనం.. అందుకున్నారు పురస్కారం

image

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు పలువురు జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలు పొందారు. RDOలు బాలకృష్ణ (నందిగామ), మాధురి (తిరువూరు), చైతన్య (విజయవాడ), జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, SE R&B భాస్కరరావు, దుర్గమ్మ ఆలయం ఈవో శీనా నాయక్, రీజనల్ ఇంటర్మీడియట్ అధికారి ప్రభాకర్ రావు ప్రశంస పత్రాలు అందుకున్నారు.

News January 27, 2026

పహల్గాం హీరో అదిల్‌కు అవార్డు

image

గత ఏప్రిల్‌లో ఉగ్రమూకలు పహల్గాంలో జరిపిన దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన అదిల్ హుస్సేన్ షాకు JK ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కునేందుకు అదిల్ యత్నించారు. హార్స్ రైడర్ అయిన ఆయన ప్రాణాలను పణంగా పెట్టి టూరిస్టులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం ₹లక్ష నగదుతో పాటు అవార్డును వారి ఫ్యామిలీకి అందజేసింది.

News January 26, 2026

కొండగట్టులో విషాదం.. 5 నెలల చిన్నారి మృతి

image

కొండగట్టు ఆంజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కన్నెపల్లికి చెందిన దుర్గం శేఖర్ తన భార్య, ఇద్దరు కవల పిల్లలతో(5 నెలలు) సోమవారం ఆంజన్న దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కోనేటిలో స్నానమాచరించాక, స్వామివారి దర్శనానంతరం ఓ పాప అపస్మారస్థితిలోకి వెళ్ళింది. దీంతో ఆసుపత్రికి తరలించగా పాప మృతి చెందినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు.