News April 25, 2024
ఏంటీ ‘లుక్ బిట్వీన్’ ట్రెండ్?

ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్న ‘లుక్ బిట్వీన్ యువర్ <<13113500>>కీ<<>> బోర్డ్’ ట్రెండ్ కొత్తదేం కాదు. 2021లో K-ON అనే యానిమేటెడ్ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి 4Chan అనే వెబ్‌సైట్ ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టింది. లుక్ బిట్వీన్ T అండ్ O అంటూ ‘YUI’ అనే పాత్రను పరిచయం చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ను నెటిజన్లు అందిపుచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఈ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది.
Similar News
News September 13, 2025
సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.
News September 13, 2025
కృష్ణా జలాల వాటాలో చుక్కనీటిని వదలొద్దు: రేవంత్

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్క నీటిని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేసి అందించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే ట్రిబ్యునల్ విచారణలో ఈ అంశాలను గట్టిగా వినిపించాలని సూచించారు.
News September 13, 2025
ఆంధ్ర క్రికెట్ హెడ్ కోచ్‌గా గ్యారీ స్టీడ్

ఆంధ్ర మెన్స్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్‌ను ACA నియమించింది. ఈ నెల 20-25 తేదీల మధ్య ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం. కాగా గ్యారీ ఆధ్వర్యంలో కివీస్ 2019 WC ఫైనల్ చేరుకుంది. అలాగే 2021 WTC టైటిల్ సాధించింది. మరోవైపు ఆంధ్ర గత రంజీ సీజన్‌లో గ్రూప్-Bలో ఆరో స్థానంలో నిలిచింది. VHTలో గ్రూప్-Bలో నాలుగు, SMATలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.