News April 25, 2024
కడప స్వతంత్ర MP అభ్యర్థిగా కూటమి అభ్యర్థి తండ్రి నామినేషన్

కడప పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ఇప్పటికే కడప ఎంపీ బరిలో వైసీపీ నుంచి అవినాశ్, కాంగ్రెస్ నుంచి షర్మిల, కూటమి నుంచి భూపేశ్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
Similar News
News March 15, 2026
బద్వేల్‌లో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

బద్వేల్‌లోని హోటళ్లపై ఆదివారం కడప జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు మైదుకూరు రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. పలువురు నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 7 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
News March 15, 2026
పులివెందుల: నిందితులు చెప్పింది వినడమే CBI పనా..?

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో నిందితులు చెప్పింది వినడమే CBI పనా?, సొంతంగా ఆలోచించదా..? అని ఆయన కుమార్తె YS సునీత ప్రశ్నించారు. పులివెందులలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. నేను రాత్రింబవళ్లు కష్టపడితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. వివేకా హత్య విషయంలో ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలని, దీనిపై పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు.
News March 15, 2026
కడప: 16 నుంచి పశువులకు టీకాలు

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లాలో ప్రతి గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.ఏ.శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లాకు 3 లక్షల డోసులను కేటాయించామన్నారు. పాడి పశువుల యాజమానులందరూ పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గాలి కుంటు వ్యాధి సోకుతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


