News January 7, 2026
వరి మాగాణుల్లో వెల్లుల్లి సాగు.. మంచి దిగుబడి, ఆదాయం

మన దగ్గర సాధారణంగా వరి కోతలు పూర్తయ్యాక అదే భూమిలో మొక్కజొన్న, సన్ ఫ్లవర్, అపరాలు నాటుతుంటాం. బంగ్లాదేశ్‌లో మాత్రం వరి కోతలు పూర్తయ్యాక ఆ భూమిలో వెల్లుల్లి నాటుతారు. వరి పంటకు వేసిన ఎరువుల వల్ల నేల సారవంతంగా ఉంటుంది. భూమిలో తేమ, వరికి వాడిన ఎరువుల వల్ల వెల్లుల్లి పంట చాలా వేగంగా, పెద్ద పరిమాణంలో పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.
Similar News
News February 4, 2026
రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.
News February 4, 2026
నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని YCP అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.
News February 4, 2026
మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


