News January 7, 2026

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ అధికారిక సెల్ ఫోన్ ఎక్కడ..?

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు చెందిన అధికారిక సెల్ ఫోన్ కనిపించట్లేదని సమాచారం. సుమారు రూ.1.20 లక్షల విలువైన సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఫోన్ మాజీ వీసీ డా.నందకుమార్ రెడ్డి ఉన్నపుడే కొనుగోలు చేశారు. నవంబర్ 26న ఆయన వీసీ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి వీసీ సెల్ ఫోన్, అధికారిక నంబర్ విశ్వవిద్యాలయంలో లేదని తెలిసింది. కొత్త వీసీ వచ్చినా సెల్ ఎవరి దగ్గర ఉందనేది చర్చనీయాంశంగా మారింది.

Similar News

News February 16, 2026

నారాయణపేటలో వికసించిన కమలం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానం బీజేపీ దక్కించుకుంది. మొత్తం 11 మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ రెబల్ అభ్యర్థిగా విజయం సాధించిన జయశ్రీ సొంత పార్టీలో చేరగా బలం 12కు చేరింది. దీంతో ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో ఛైర్మన్ స్థానం బీజేపీ సొంతమైంది. ఛైర్‌పర్సన్‌గా కొండా శ్వేత, వైస్ ఛైర్‌పర్సన్‌గా మంజుల ప్రమాణ స్వీకారం చేశారు.

News February 16, 2026

పార్వతీపురం జిల్లా పోలీస్ గ్రీవెన్స్‌కు 11 ఫిర్యాదులు

image

ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని పార్వతీపురం అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News February 16, 2026

వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ డబ్బు విడుదల

image

TG: రాష్ట్రంలో వరి సన్నాలను పండించి, విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బును విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో బోనస్ కింద రూ.514.36 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమకానుంది.