News April 25, 2024

అల్లర్లు మొదలైతే మోదీదే బాధ్యత: ఒవైసీ

image

ముస్లింలపై ప్రధాని మోదీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముస్లింలపై ద్వేషమేనా మోదీ గ్యారంటీ? 2002 నుంచి ఆయన ఇదే చేస్తున్నారు. రేపు దేశంలో అల్లర్లు మొదలైతే కచ్చితంగా ప్రధానే బాధ్యత వహించాలి. దేశంలో 17కోట్లమంది ముస్లింలున్నారు. వారికి కూడా ఆయనే ప్రధాని. ఈ విధంగా ముస్లింలను ద్వేషించడం దారుణం’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News March 7, 2026

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు

image

దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ ఇంపోర్ట్స్‌ను 60% నుంచి 70%కి పెంచినట్లు తెలిపాయి. అలాగే ముప్పులేని పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.

News March 7, 2026

REWIND: INS ఖుక్రీ.. 194 మంది వీరమరణం

image

ఇటీవల US దాడిలో ఇరాన్ నౌక ‘<<19299071>>దేనా<<>>’ మునిగిపోవడంతో 1971 నాటి INS ఖుక్రీ త్యాగం గుర్తుకొస్తోంది. నాటి యుద్ధంలో పాక్ జలాంతర్గామి ‘హంగోర్’ ప్రయోగించిన టార్పెడో నుంచి INS కిర్పాన్ తప్పించుకుంది. వెంటనే హంగోర్‌ను అడ్డుకునేందుకు ఖుక్రీ కదిలింది. అయితే అది వదిలిన రెండో టార్పెడో నేరుగా ఆయిల్ ట్యాంకులకు తగలడంతో భారీ పేలుడు సంభవించింది. కేవలం 2 నిమిషాల్లోనే నౌక సముద్రంలో మునిగి 194 మంది వీరమరణం పొందారు.

News March 7, 2026

క్యాన్సర్‌ను ఓడించి UPSC విజేతగా రైతు బిడ్డ

image

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజయ్ దహారియా UPSC 2025 ఫలితాల్లో 946వ ర్యాంకుతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. రైతు బిడ్డ అయిన ఆయన ఆరేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడారు. ఈ క్రమంలో చూపు మందగించింది. అయినా వెనకడుగు వేయలేదు. రెండుసార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా 38 ఏళ్ల వయసులో UPSC ర్యాంకు సాధించారు. 3 ఉద్యోగాలకు రాజీనామా చేసి, అనారోగ్యాన్ని జయించి సాగించిన ఈ జర్నీ అనేక మందిని ఇన్‌స్పైర్ చేస్తోంది.