News January 7, 2026
మొక్కజొన్నతో పాటు మిరప సాగు.. చైనా రైతుల వినూత్న ఆలోచన

చైనాలో రైతులు మొక్కజొన్న తోటల్లోని పొత్తుల్లో గింజలు రావడం మొదలవ్వగానే ఆకులను తొలగించి వాటి కింద మిరప మొక్కలను నాటుతుంటారు. మొక్కజొన్న పంట పూర్తవ్వగానే కాడలను వేళ్లతో సహా పీకేయకుండా సగం వరకు కత్తిరిస్తారు. దీని వల్ల అవి మిరప మొక్కలకు సహజ ఊతకర్రలుగా ఉండి, గాలులకు అవి పడకుండా రక్షణగా ఉంటాయి. ఇలా వారు ఒకేసారి రెండు పంటలను పండించి మంచి ఆదాయం పొందుతారు. దీన్నే ఇంటర్ క్రాపింగ్, realy క్రాపింగ్ అంటారు.
Similar News
News February 17, 2026
ఇది కదా సక్సెస్ అంటే..

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య పాత ఫొటో ఒకటి SMలో వైరలవుతోంది. 2014లో తన ఫ్రెండ్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి హాజరైనప్పటి ఫొటో అది. కట్ చేస్తే.. కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని 30Y వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. సక్సెస్ అంటే ఇదేనని, ఎంత ఎత్తుకు ఎదిగినా అతను ఇప్పటికీ తన స్నేహితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
News February 17, 2026
భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్: మోదీ

కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన టాటా-ఎయిర్‌బస్ H125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్‌ను మోదీ, మాక్రాన్ ప్రారంభించారు. 2026ను భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్‌గా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య స్టార్టప్‌లు, AI, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంచుతామన్నారు. ఫ్రాన్స్‌లో వివేకానంద కల్చరల్ సెంటర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్ అని మోదీ పేర్కొన్నారు.
News February 17, 2026
మార్చి మొదటి వారంలో SSC హాల్ టికెట్లు

AP: టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్కూల్ లాగిన్, ‘మన మిత్ర’ యాప్ ద్వారా వీటిని పొందవచ్చన్నారు. పేరు, పుట్టిన తేదీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ సరిచూసుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లలో పొరపాట్లున్నా ఆందోళన చెందవద్దని సూచించారు. యూడైస్ పోర్టల్‌లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందన్నారు.


