News January 7, 2026
WGL: పోలీసుల అదుపులో కేటుగాడు!

నగదును రెండింతలు చేస్తామంటూ బురిడీ కొట్టించిన ఓ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ORR దగ్గరలోని <<18747599>>ఫామ్ హౌజ్‌లో రూ.55 లక్షల నగదు<<>>ను పూజలు చేసి రెండింతలు చేస్తామంటూ మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు ముంబయిలో ఉన్నట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ, ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 15, 2026
MHBD: మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు ఇవే!

జిల్లాలో 4 మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు అధికారులు ప్రకటించారు. MHBD మున్సిపాలిటీలో ఎస్టీ 7,ఎస్సీ 5, జనరల్ మహిళ 10, జనరల్ 8, బీసీ 6 (మొత్తం 36), డోర్నకల్ ఎస్టీ 3, ఎస్సీ 4, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం15), మరిపెడ ఎస్టీ 6, ఎస్సీ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం 15), తొర్రూరు ఎస్టీ 2, ఎస్సీ 3, జనరల్ మహిళ 5, జనరల్ 3, బీసీ 3 (16) కాగా, కేసముద్రం రిజర్వేషన్ రావాల్సి ఉంది.
News January 15, 2026
ఆసిఫాబాద్: ఈ సర్పంచ్ GREAT..!

గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సర్పంచ్ విద్యుత్ స్తంభమెక్కి నిబద్ధతను చాటుకున్నారు. పెంచికల్పేట్ మండలం పోతేపల్లిలో సంక్రాంతి పండుగ వేళ వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని సర్పంచ్ దుర్గం పోచన్న హామీ ఇచ్చారు. అయితే బుధవారం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా చేయకుండా ఆయనే స్వయంగా స్తంభమెక్కి దీపాలు అమర్చారు. నాయకుడికి ఉండాల్సింది హోదా కాదు, సేవా దృక్పథమని నిరూపించిన పోచన్నను గ్రామస్థులు కొనియాడారు.
News January 15, 2026
పాలమూరులో సంక్రాంతి సంబరాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. భోగిని రొట్టెల పండుగగా, సంక్రాంతిని పులగం, కనుమను తునకల పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అరిసెలు, ప్రత్యేక వంటకాలతో పల్లెలు సందడిగా మారాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జిల్లావ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తోంది.


